అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
– రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 8 : భక్తిశ్రద్ధలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న ఆలయ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్. రంగారెడ్డి నగర్ లో నల్ల పోచమ్మ తల్లి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు బాలరాజ్, ప్రధాన కార్యదర్శి గరిగే రమేష్ ముదిరాజ్, ఆలయ కమిటీ సభ్యులు దేవేందర్, సుధాకర్, వెంకటేష్, రవి యాదవ్, సంపత్, బస్తివాసులు పాల్గొన్నారు.