పద్మా నగర్ ఫేజ్ -2 నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కు వినతి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 18 : కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మా నగర్ ఫేస్ – 2 నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని సంక్షేమ సంఘం అధ్యక్షులు డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలనీకి చెందిన పలువురు ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఫోన్ ద్వారా అధికారులను సంప్రదించి పద్మా నగర్ సర్కిల్ నుంచి నిత్యం వేలాది మంది నగరంలోని సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్, కోఠీ ప్రాంతాలకు కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు బస్సులో ప్రయాణించేవారని తెలిపారు. కరోనా సమయంలో ఇక్కడ నుండి నడిచే బస్సులను నిలిపివేశారని, బస్సులను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వినతి పత్రం అందించిన వారిలో కాలనీ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, కోశాధికారి సంజీవ్ కుమార్, కాలనీ వాసులు ఉన్నారు.