పేద విద్యార్థులకు అండగా ఉంటాం
– బీజేపీ నాయకుడు, కేకేయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్
కుత్బుల్లాపూర్( న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 8: విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో మెలిగితే ఉన్నత స్థానాలకి ఎదుగుతారని బీజేపీ నాయకుడు, కేకేయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆయన శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలు, చేతి గడియారాలు, గొడుగులు కలిగి ఉన్న కిట్లను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కూడా జై కుమార్ గౌడ్ సహాయ సహకారాలతో ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు చేయూతగా తమ వంతుగా సహాయ సహకారాలు చేస్తున్నామని, అన్ని సమయాలలో వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కందిశ్రీరాములు, అంగడి మల్లేష్, దేవర రమేష్, పోల్కం విగ్నేష్, వెంకట రత్నం, విజేందర్ రెడ్డి, గుబ్బల లక్ష్మీనారాయణ,అనుక్, మారె గణేష్, గుబ్బల వెంకటరమణ, శ్రీనివాస్ గౌడ్, చక్రవర్తి, మహేష్ పటేల్, హరి వర్ధన్ ముదిరాజ్, విజయ్ కుమార్, కెకేఎం ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు