రద్దయిన నోట్లతోపాటు ఫేక్ కరెన్సీని తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు.వెంకటాపురంలో గురువారం పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో రద్దయిన రూ.వెయ్యి, రూ.500 నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్ల విలువ సూమారు రూ.1.65 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వెంకటాపురంలో గురువారం పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కేశవాపూర్ కు చెందిన పప్పుల నాగేంద్రబాబు, కోదాడ మండలం సాలర్జింగ్ పేటకు చెందిన శ్రీరాముల నాగ లింగేశ్వరరావు, భద్రాచలం ఏఎంసీ కాలానికి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురంకి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డీ శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధనగర్ కు చెందిన ఆయుర్వేద వైద్యులు గంటా యాదగిరి, మలక్‌పేట బ్యాంకు కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్ సింగ్, చత్తీస్ గడ్ కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ నోట్ల కథ వెనుక పెద్ద డ్రామా ఉంది. నాగేంద్రబాబు అనే వ్యక్తి చేసిన కుట్రలో వీరంతా ఇరుక్కుపోయారు. నాగేంద్రబాబు.. తాను చేసిన అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ చేయాలనుకున్నాడు. ఈ సంగతిని తన స్నేహితుడు నాగ లింగేశ్వరరావును కలిశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తారని నాగ లింగేశ్వరరావు నాగేంద్రబాబను నమ్మించాడు. ఇది నిజమే అనుకున్న నాగేంద్రబాబు అదే పనిలో పడ్డాడు. తనకు తెలిసిన వారికి రహ్యంగా ఈ విషయాన్ని చేరవేశాడు.
తనకు తెలిసినవారి వద్ద నుంచి కొంత పాత కరెన్సీని సేకరించాడు. ఇందులో ముందుగా హైదరాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డికి రూ. ఐదు లక్షలు ఇచ్చి వారి వద్ద సుమారు రూ. 2 కోట్ల రద్దయిన పాత కరెన్సీ, దొంగనోట్లను కొనుగోలు చేశాడు. ఆ డబ్బును భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారినుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్ లు, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే నాగేంద్ర బాబుకు కట్టు కథ చెప్పిన స్నేహితుడు నాగ లింగేశ్వరరావు కోసం గాలిస్తున్నారు.