లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు (డైమన్డ్ శ్రీను) ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమము నేటికీ 63 రోజులకు చేరింది
తేదీ 10. 1. 2023 మంగళవారం ఉదయము 8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు లయన్ రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు (డైమన్డ్ శ్రీను) ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా అన్న భీమోజు నాగార్జున చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య ఉచిత అన్నదాన పథకానికి ప్రతిరోజు దాతలు ముందుకు వస్తూ పోటాపోటీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు అభినందనలు తెలిపారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సత్యనారాయణ చారి మరియు అరిబండ శ్రీనివాస్ దుర్గారాణి గార్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఇంత పెద్ద ఎత్తున దాతలు నుండి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని వీలైన ప్రతిసారి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తానని ఇంత గొప్ప సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లైన్స్ క్లబ్ నాయకులను అభినందించారు మరియు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంగా మిర్యాలగూడ పట్టణ ప్రముఖులు శ్రీరామోజు రామానుజాచారి మరియు వారి సోదరి చూడామణి గార్ల సహాయ సహకారాలతో గత రాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి అభాగ్యులైన నిరుపేద నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ చేతుల మీదుగా దాదాపు 25 మందికి పంపిణీ చేయడం లయన్స్ క్లబ్ మిత్రుల గొప్ప మనసుకు నిదర్శనమని తెలిపారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని ఇంత మంచి సేవా కార్యక్రమం లో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని అని ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు సేవ నిర్వహణ చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ మిత్రులు నిరాడంబరంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు ప్రచారం లేకుండా చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు
కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ మాసెట్టి శ్రీనివాస్ . లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు . లయన్ డాక్టర్ రాజు . లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజు లయన్ బి.ఎం .నాయుడు మరియు వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.