కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గద్దర్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. దేశ వ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయించాలని గద్దర్ కోరారు.
ఇవాళ నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గద్దర్ కలిశారు. ఒకప్పటి పీపుల్స్ వార్ లో పనిచేసిన గద్దర్ రెండు దశాబ్ధాల క్రితం ఆరోగ్యం సహకరించకపోవడంతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఉద్యమంలో ఉన్న సమయంలో ఆయనపై దేశ వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. నిషేధిత సంస్థలో పనిచేస్తున్న ఆయనపై కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ఈ కేసుల కారణంగా గద్దర్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసుల నుంచి విముక్తి కల్పించాలని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇప్పంచాలని గద్దర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు.