మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం
విశాఖపట్నం: మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం జరిగింది. మంత్రి లోపలికి వెళ్తుండగా సిఐ అడ్డుకున్నారు. వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని ఆయన అనుచరులు అనుమతించేది లేదని చెప్పిన సిఐ స్పష్టం చేసారు. మంత్రి బ్రతిమలాడుతుంటే కుడా దురుసుగా గెట్ వేసి వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సిఐ చెప్పారు. ఎంట్రన్స్ వద్ద మంత్రిని సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్భషలాడారని మంత్రి అనుచరులు మండిపడ్డారు.
తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేసారు. సి ఐ క్షమాపణలు చెప్పక పోవడంతో మంత్రి అలిగి వెనక్కి వెళ్లిపోయారు.