బ్రోకర్ రాలేదు… పాల మల్లిగాడు రాలేదు!: రేవంత్ రెడ్డి
మేడ్చల్: సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలను దగా చేశారని, ఏ ఒక్క హామీని అమలు చేసినా ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని నిన్న సవాల్ చేశాను, 24 గంటలు దాటినా ఒక్కడు రాలేదన్నారు.
మూడుచింతలపల్లిలో టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రి సి.మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. దత్తత గ్రామాల్లో ఒక్క హామీని అమలు చేసినా ముక్కును నేలకు రాస్తానని చెప్పినా ఒక్కడు స్పందించలేదన్నారు. పాలు అమ్మే మంత్రి మల్లారెడ్డి రాలేదు. నీళ్లు అమ్మేవాడు రాలేదు. భూములు కబ్జాలు చేసేవాళ్లు కూడా జాడ లేదన్నారు. జోకర్ మల్లన్న కూడా కన్పించడం లేదన్నారు. ఈ మల్లిగాడు వేదిక ఎక్కితే జోకర్ మాదిరి, వేదిక దిగగానే భూముల బ్రోకర్ లాగా మాట్లాడుతాడని అన్నాడు. తన నియోజకవర్గంలో ఎవరు భూములు కొనుగోలు చేసినా పాల మల్లిగాడికి కమిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. తనకు సిఎం కావాలనే ఆశ లేదని, ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.