ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పును అందించాలి.-ఆర్వో సైదులు
ఈ నెల 20 వరకు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి…
బి ఎల్ ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓ లతో ఆర్వో పులి సైదులు..
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 16: ఓటర్ స్లిప్పులను ఓటరు, ఓటరు యొక్క కుటుంబ సభ్యులకు మాత్రమే అందించాలని ఆర్ఓ పులి సైదులు పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రిటర్నింగ్ కార్యాలయంలో ఏ ఈ ఆర్ ఓ లు, బి ఎల్ ఓ సూపర్వైజర్లు, బి ఎల్ ఓ లతో కలసి ఏర్పాటు చేసిన ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమంలో ఆయన తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈనెల 20 లోపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. ఓటర్ స్లిప్పులను ఓటరు యొక్క కుటుంబ సభ్యులకు మాత్రమే అందించాలన్నారు. ఇంటి యజమానులకు ఇవ్వకూడదని సూచించారు. ఒకరి ఓటరు స్లిప్పు మరొకరి చేతిలో ఉండడం నేరం అన్నారు. ఇతర ప్రాంతాలలో ఓటు హక్కు ఉండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఫామ్ 12 ను దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతిరోజు ఎన్ని స్లిప్పులు పంపిణీ చేశారో సమాచారం ఇవ్వాలన్నారు. ఓటర్ స్లిప్పులు ఇచ్చిన తర్వాత ఓటరు యొక్క సంతకము తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్వోలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.