కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 26: కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మా నగర్ ఫేజ్ -2 రోడ్ నెంబర్ 23 లోని సాయినిధి నిలయం అపార్ట్మెంట్ లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని ఇంటిలిజెన్స్ సిఐ శ్రీనివాసరావు (కన్నె స్వామి) ఘనంగా నిర్వహించారు. మాన్యశ్రీ శ్రావణ్ కుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజ అయ్యప్ప స్వామి నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి.
సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన మహా పడిపూజ వేదమంత్రాలతో పాటు అనన్యస, కనన్యసలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అంగపూజ, అష్టోత్తరాలు, మెట్లపూజ, పల్లకి సేవ (ఊరేగింపు)తో పాటు చివరగా ఉయ్యాలలో పవళింపు సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మాలాధారణ చేసుకున్న స్వాములకు, భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. బద్రి భజన బృందం వారు భక్తి పాటలు తో అలరించారు. ఈ మహోత్సవంలో సన్నిధానం స్వాములు ప్రసాద్, బాలాజీ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సాయి, రామ్మోహన్, రాజశేఖర్, రాంబాబు, జయ వేదాన్ష్, వెంకటలక్ష్మి, రమేష్, సంతోష్ కుమార్, నరసింహా, భక్తులు పాల్గొన్నారు.