అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి.- ఎమ్మెల్యే
• టీజీఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ అలీ ఫారుఖీకి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే వివేకానంద్
• బాచుపల్లి, శంభిపూర్, భౌరంపేట్ లో 33 కెవి లైన్ ఏర్పాటు చేయాలి
• బహదూర్ పల్లి – కొంపల్లి రోడ్డు విస్తరణ పనుల్లో విద్యుత్ లైన్ల తరలించాలని వినతి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 10 : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం అభివృద్ధి పనుల్లో ఆటంకం కలిగిస్తున్న విద్యుత్ మరమ్మతు (ఎల్.సి) పనులతో పాటు పలు సమస్యలను త్వరితగతిన పూర్తిచేసి అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ టీజీఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారుఖీని ప్రధాన కార్యాలయంలో బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో 24 గంటలు ఆటంకం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాను విషయంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని విద్యుత్ సమస్యలపై వారు చర్చించారు. ఈ మేరకు బాచుపల్లి, శంభిపూర్, భౌరంపేట్ లో 33 కెవి లైన్ ఏర్పాటు చేయాలన్నారు. బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల తరలింపు కోసం ఎల్ సి అనుమతులు ఇవ్వాలని, అలాగే బాచుపల్లి – మల్లం పేట్ – బౌరంపేట్ మార్గంలో చేపడుతున్న హెచ్ఎండిఏ రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల తరలింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని బౌరంపేట్, బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీ, మల్లంపేటలోని శంభీపూర్ ప్రాంతాలలో విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. దుండిగల్, ఇతర ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు నూతన విద్యుత్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపట్టి లబ్ధిదారుల విద్యుత్ సమస్యలను తీర్చాలన్నారు. బహదూర్ పల్లి – కొంపల్లి రోడ్డు విస్తరణ పనుల్లో విద్యుత్ లైన్ల తరలింపు పనులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన టీజీఎస్పీడీసీఎల్ సిఎండి సదరు అంశాలపై త్వరలోనే చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.