ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతం
√ కుత్బుల్లాపూర్ డిఅర్సీ
కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
√ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 29: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతం కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎన్నికల అధికారులకు సూచించారు. సుచిత్ర లోని లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ డిఆర్సీ (డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్) కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కుత్బుల్లాపూర్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు చేపట్టిన చర్యలు, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను, సువిధ యాప్ లో ఇస్తున్న ప్రచార అనుమతులను, కార్యాలయంలో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
అనంతరం నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అక్కడి నుంచి జగద్గిరి గుట్టలో ఉన్న చైతన్య విద్యానికేతన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్వో పులి సైదులు, ఈఆర్వో నాగమణి, ఏఈఆర్వోలు మల్లారెడ్డి, రెహ్మాన్ ఖాన్, ఉదయ్ కుమార్, శ్రీనివాస్, సుచరిత, ఫుల్ సింగ్, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.