– గుండెపోటుతో హైదరాబాద్ నివాసంలో తుది శ్వాస
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), జూన్ 29 : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి, ఎంపీ, పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. డి. శ్రీనివాస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేస్తాడు.