కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఎఫ్ఏల నూతన కార్యవర్గం ఎన్నిక
– నూతన అధ్యక్ష కార్యదర్శులుగా శివ కుమార్, రవీందర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 22 : జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పారిశుధ్య విభాగ సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్ఎఫ్ఏ) సంఘం నూతన కార్యవర్గాన్ని సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిట్యాల శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా రస్తాపురం రవీందర్, కోశాధికారిగా బాపుగారి రవికుమార్ లను ఎన్నుకున్నారు. అలాగే రంగారెడ్డి నగర్ డివిజన్ ఎస్ ఎఫ్ ఏ అధ్యక్షుడిగా వి. గణేష్, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా టి. మల్లేష్, కుత్బుల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా కే. కుమార్, జీడిమెట్ల డివిజన్ అధ్యక్షుడిగా ఎం. జార్జ్ ను ఎన్నుకున్నారు. తమను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్న తోటి ఎస్ఎఫ్ఐ లకు ధన్యవాదాలు తెలుపుతూ సర్కిల్లోని ఎస్ఎఫ్ఐ ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని సభ్యులు అన్నారు. అనంతరం ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సర్కిల్ ఏ ఎమ్ హెచ్ వో డాక్టర్ భార్గవ నారాయణ శాలువాలు కప్పి అభినందించారు.