కుత్బుల్లాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 1: ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ ‘జైశ్రీరామ్’ నామస్మరణతో శనివారం మారుమోగింది. పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో స్వామివారికి తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ఆకు పూజ, వడమాలలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు చేసి, ర్యాలీలను ఘనంగా నిర్వహించారు. జీడిమెట్ల డివిజన్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీ లోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత సింహారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు ఆలయాల్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బాపూనగర్ లోని శ్రీ నల్ల పోచమ్మ ముక్తేశ్వర ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలు ఆలయాల కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.