కుత్బుల్లాపూర్ లో జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట
✓ వెన్నెలగడ్డలోని ఎస్ టి పి పనులను పరిశీలించిన కమిషనర్
✓ ఈనెల 27న సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో సందర్శన
✓ ఎస్ టి పి పనులతో రహదారుల నిర్మాణం, ఎన్నా చెరువులో శుభ్రం చేయాలని ఆదేశం
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి జూలై 22 ; కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నెలగడ్డ లో నిర్మిస్తున్న నూతన ఎస్ టి పి (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) పనులను జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహన్ తో కలిసి సోమవారం ఉదయం పరిశీలించారు. ఈనెల 27వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదరు ఎస్ టి పి ప్లాంటును ప్రారంభించనున్న నేపథ్యంలో ఎస్ టి పి పనులతో పాటు రహదారి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. అనంతరం పక్కనే ఉన్న ఎన్నా చెరువును సందర్శించి చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడ నుంచి ఫతేనగర్ లో నిర్మిస్తున్న ఎస్ టి పి ప్లాంటును పరిశీలించేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ వి నరసింహ, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ లక్ష్మీ గణేష్, ఏ ఎమ్ ఓ హెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, పట్టణ ప్రణాళిక ఏసీపీ సాయిబాబా, డిఈలు పాపమ్మ, రఘుపతి రెడ్డి, హార్టికల్చర్ మేనేజర్ రఘువీరారెడ్డి, ఎంటమాలజీ ఏఈ ఉమారాణి, జలమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు