గణేష్ మండప నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి- సిఐ ప్రశాంత్

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 7:  సంస్కృతి , సంప్రదాయాలకు నిలయమైన పండుగలను కలసికట్టుగా జరుపుకునే తత్వం తెలంగాణ ప్రజల సొంతం అని పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్ అన్నారు. ఈ నెల 18న వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహ మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సీఐ ప్రశాంత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పీఎస్ పరిదిలో త్వరలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఉత్సవ కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై వినాయక మండప ఏర్పాట్లపై పోలీసులు సూచించిన నియమ నిబంధనలను పాటించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More