ఘనంగా ఈఈ కృష్ణ చైతన్య పదవీ విరమణ సన్మాన సభ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 1: కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈఈగా విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ పొందిన కృష్ణ చైతన్యను ఉన్నతాధికారులు, సహచరులు,సిబ్బంది, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఘనంగా సన్మానించారు.
జీడిమెట్ల డివిజన్ పరిధి దండమూడి ఎన్ క్లేవ్ వద్ద ఉన్న శుభం హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్ఈలు చిన్నారెడ్డి, అనిల్ రాజ్ , డీసీలు వి. నర్సింహా, రమేష్, ఈఈలు కిష్టప్ప, లాల్ సింగ్ ఏఎంసీలు కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, డీఏవో పుష్పలత, డీఈఈలు పాపమ్మ, రూపదేవి, ఏఈలు మల్లారెడ్డి, సురేందర్ నాయక్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. వారంతా ఈఈ కృష్ణ చైతన్యతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
అనంతరం కృష్ణ చైతన్య మాట్లాడుతూ మనం చేసే పని మీద పట్టుదల, కృషి ఉన్నప్పుడే ముందుకు సాగుతామన్నారు. అందరి సహాయ, సహకారాలు, సూచనలు, అభిమానంతోనే సంవత్సరాల తరబడి సర్విస్ చేయగలిగానన్నాడు. పని విషయంలో ఉన్నతాధికారులతో గిల్లిగజ్జాలు, పట్టువిడులు సహజమే అన్నారు. వాటన్నింటినీ మనస్సులో పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవాలని తెలిపారు. తన సర్వీస్ కాలంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. ప్రధానంగా కుటుంబ సభ్యుల చేయూత ఎంతో అవసరమని తెలుపుతూ ఆయన భార్య కోసం చెప్పే సందర్భంలో తనకు తల్లిదండ్రులు ఎంతో ఆమె కూడా అంత చేయూతనిచ్చిందని ఒకింత భాగోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.