ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 25 : అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండి పనులన్నీ సకాలంలో నెరవేరాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిళ్ల కార్యాలయ ఆవరణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో ఆమె, ఉప కమిషనర్లు వి. నరసింహ, ఎల్ పి. మల్లయ్య తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జంట సర్కిళ్ల కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం తెల్లవారుజాము నుంచే గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, శాంతి హోమంతో పాటు అమ్మవారికి విశిష్ట అభిషేకాలు చేసి కనుల పండగ అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఈఈలు కిష్టప్ప గోవర్ధన్ గౌడ్ డిఈఈ లు పాపమ్మ, రూపా దేవితో పాటు జంట సర్కిళ్ల వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.