జంట సర్కిళ్ల కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిల్ ల కార్యాలయ ఆవరణంలో జాతీయ జెండాను ఉప కమిషనర్లు వి. నరసింహ, ఎల్ పి మల్లయ్య అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
అంతకుముందు జంట సర్కిళ్ల కార్యాలయాల భవనాలను, ఉద్యానవనాన్ని, పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాల వెలుగులతో చూపర్లను ఆకట్టుకునేలా చక్కగా అలంకరించారు.