పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అఖిలభారత హిందూ మహాసభ నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం లోని మహిషాసురుడి స్థానంలో మహాత్మా గాంధీని పోలినటువంటి బొమ్మను సంహరిస్తున్నట్టుగా రూపొందించడాన్ని హేయమైన చర్యగా ప్రముఖ సీనియర్ ఆర్యవైశ్య నాయకుడు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తీవ్రంగా ఖండించారు
హైదరాబాద్ నగరంలోని గాంధీ మహాత్మా విగ్రహానికి పలువురు ఆర్యవైశ్య నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంఘటనను నిరసిస్తూ వెంటనే అన్ని గ్రామ పట్టణ నగర కేంద్రాలలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు
నిర్వాహకులు వెంటనే జాతికి క్షమాపణ చెప్పి తమ తప్పును సరిదిద్దుకోకుంటే వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ లీడర్ సంక నరేష్ గుప్తా మరియు పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.