స్థానికులకు అన్యాయం జరిగితే మంత్రి ఎమ్మెల్యేని అడ్డుకుంటాం.-నర్సారెడ్డి భూపతిరెడ్డి
- డబుల్ బెడ్ రూం ఇల్లు అర్హులైన స్థానికులకు ముందు ఇవ్వాలి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 20: రైతుల భూములు తీసుకొని డబుల్ బెడ్ రూములు నిర్మించి, వాటి కేటాయింపుల విషయంలో వారికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా అర్హులైన స్థానికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని అన్నారు. హామీ ప్రకారం స్థానిక గ్రామాల్లోని పేదలకు 10 శాతం పంపిణీ చేసిన అనంతరమే ఇతరులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గంలో సుమారు లక్షకు పైగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూంల కేటాయింపుల విషయంలో స్థానికులకు అన్యాయం జరిగితే మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ ను అడ్డుకునేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన దళితులకు కాకుండా అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, అర్హులైన దళితులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వొంపుగూడెం రాజిరెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ ఓబిసి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్, దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన్ కార్యదర్శులు అర్కల విజయ్ గౌడ్, సాధు యాదవ్, పరశురాం గౌడ్, అసెంబ్లీ కో ఆర్డినేటర్ బత్తుల చిరంజీవి, దుబాయ్ మల్లారెడ్డి, చెవిటి శ్రీనివాస్, యెల్లేష్,నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు