డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యేలు..
దుండిగల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 20 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ లో నేడు (గురువారం) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2వ విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కార్యక్రమ ఏర్పాట్ల పనులను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులతో కలిసి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.