దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 2: దేశం తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు గణపతి సచ్చిదానంద స్వామిజీ రాష్ట్రంలో అడుగుపెట్టడమే నిదర్శనమని అన్నారు. దుండిగల్ లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన దత్త ప్రార్థనా మందిరాన్ని రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్వామీజీ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎప్పుడు ఏ కష్టం నష్టం వచ్చిన దత్తపీఠం ప్రార్థన ఆలయంలో కూర్చుంటే తప్పక ప్రశాంతత చేకూరి వారి కష్టాలు తీరుతాయని విశ్వాసం తనకు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దసరా ఉత్సవాలను మైసూర్ లో కాకుండా తెలంగాణలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి శుభ సూచకమని వారు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి నాయకుడని, బుద్ధిమంతుడని రాష్ట్రానికి తప్పక మేలు చేకూరుస్తాడని గణపతి సచ్చిదానంద స్వామీజీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, సొంటి రెడ్డి పున్నారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్, యువజన కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ సెల్, ఎన్ ఎస్ యు ఐ, ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.