నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి),  మే 24 : హెచ్ఎంటి విద్యుత్ సబ్ స్టేషన్ 11 కెవి కుత్బుల్లాపూర్ ఫీడర్ పరిధిలోని చెట్ల కొమ్మలు తొలగింపు, మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ గ్రామం, బీరప్ప నగర్, మంజీరా అపార్ట్మెంట్స్ , కృష్ణ కుంజ్ హోమ్స్, వీరస్వామి నగర్, వెంకటేశ్వర నగర్, విమనపురి కాలనీ ప్రాంతాలతో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.

అలాగే చింతల్ విద్యుత్ సబ్ స్టేషన్ లోని 11 కెవి గణేష్ నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు గణేష్ నగర్, షా థియేటర్ వెనక వైపు ,  జనహిత హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో  విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More