ప్రమాదవశాత్తు విద్యుదాఘాదానికి గురై పెయింటర్ మృతి
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి జూన్ 7 : ఓ ఇంటి బయట మొదటి అంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాధానికి గురై పెయింటర్ మరణించాడు. ఈ సంఘటన పేట్ అషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా మద్దెల వాయి మండల పరిధి హవేలీ ఘన్పూర్ గ్రామానికి చెందిన శ్రీపతి బాగయ్య కుమారుడు శ్రీపతి పరమేష్ (40) చింతల్ లోని పద్మా నగర్ ఫేజ్ -2 లో ఉంటూ పెయింటర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పద్మా నగర్ ఫేజ్ -2 సర్కిల్ సమీపంలో ఓ ఇంటికి పెయింటింగ్ వేసేందుకు కాంట్రాక్ట్ ఒప్పుకొని పనులు చేస్తున్నాడు. సదరు ఇంటి బయట మొదటి అంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తుండగా అక్కడ ఉన్న ఓ కిరాణా దుకాణం బోర్డును తీసే క్రమంలో ఆ బోర్డు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ఎల్ టీ తీగలపై పడింది. దీంతో విద్యుదాఘాధానికి గురై పరమేష్ కింద పడిపోయాడు. దీనిని గమనించిన ఇంటి యజమాని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతని నోటి నుంచి రక్తస్రావం అయ్యి చనిపోయాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.