నియామక పత్రం అందజేసిన రాష్ట్ర బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 10:
బీజేపీ కుత్బుల్లాపూర్ నాయకులు పసుల వెంకటేష్ ముదిరాజ్ ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్ రాజు నియమించారు. సదరు నియామక పత్రాన్ని కుత్బుల్లాపూర్ బీజేపీ కార్యాలయంలో డా. ఎస్. మల్లారెడ్డి ఆయనకు ఆదివారం అందజేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమించిన అధిష్టానం కి ధన్యవాదాలు తెలియజేసారు. రానున్న ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ లో పార్టీ విజయానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి, బీజేపీ నాయకులు పత్తి రఘుపతి, చెంది శ్రీనివాస్, భీమరాజు, రాచకొండ రాజు, మంద మహేష్ ముదిరాజ్, బిజెపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.