భాగ్యరధి కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 21: కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి చింతల్ లోని భాగ్యరధి జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలను యోగ నిపుణులు నాగమణి, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా శుక్రవారం నిర్వహించారు.
అతి పురాతనమైన, భారతీయ సంస్కృతిలో భాగమైన యోగను అభ్యసించడం వల్ల శారీరక ధృడత్వంతో పాటు మానసిక పరిపక్వత లభించి లక్ష్యంపై దృష్టి కేంద్రీకృతం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించి ప్రపంచానికి యోగా విశిష్టతను తెలియజేయాలన్నారు. యోగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుందని, తద్వారా ఎన్నో రోగాలను అరికట్టగలమన్నారు. అనంతరం విద్యార్థులతో యోగాసనాలను చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు ఎన్. వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.