సత్ జ్ఞాన్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 21: యోగా, ధ్యానం (మెడిటేషన్) విద్యార్థి దశ నుంచే నేర్చుకుంటే పిల్లలకు ఏకాగ్రత, శారీరక పటుత్వం కలిగి ఉంటారని, చదువులతో పాటు ఎంచుకున్న ఏ రంగంలోనైనా రాణించడానికి దోహదపడతాయని సత్ జ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ చింతల మల్లేశం అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర నగర్ లోని పాఠశాలలో విద్యార్థులకు యోగా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. యోగా శిక్షకురాలు మహేశ్వరి యోగా, మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. అనంతరం వారితో యోగాసనాలు వేయించి, సూర్య నమస్కారాలు చేయించారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.