సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా. -ఎమ్మెల్యే వివేకానంద్
- పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక చేయూతనందిస్తున్నాం.
- అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 22: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 38 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ.37,48,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి శుక్రవారం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ అద్యేక్షులు, సీనియర్ నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.