సెల్లార్ తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 3: వర్షాకాలన్ని (మాన్సూన్) దృష్టిలో పెట్టుకొని కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని భవన నిర్మాణదారులు, యజమానులు సెల్లార్ గుంతలు కానీ, సెల్లార్ విస్తరణ పనులు కానీ, వాటికి మరమ్మతులు కానీ వర్షాకాలం ముగిసే వరకు చేపట్టకూడదని జంట సర్కిళ్ల
ఉపకమిషనర్లు వి. నర్సింహా, ఎల్ పీ మల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, జీహెచ్ఎంసీ ఆదేశాలను పెడచెవిన పెట్టిన జరిగే అనార్థాలకు వారిని బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండే ప్రజలు వాటిని వెంటనే ఖాళీ చేయలన్నారు. తద్వారా వర్షం వల్ల సంభవించే అనార్థాలతో పాటు ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు.