హెచ్ఎంటి అటవీ ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు


కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 26: కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి అటవీ ప్రాంతంలో 133 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన చెత్తాచెదారం, వ్యర్ధాలకు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పక్కనే విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ తీగలు ఉండడంతో ఏ ప్రమాదం సంభవిస్తుంటానని స్థానికులు ఆందోళన చెంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు ఏ విధంగా అంటుకున్నాయో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More