అర్ధాంతరంగా మూసివేసిన సెయింట్ మోసెస్ పాఠశాల
~ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
~ సమాచారం ఇవ్వకుండా మూసివేసారని పాఠశాల ముందు నిరసన
~ సరిపడ విద్యార్థుల సామర్థ్యం లేకపోవడంతోటి మూసివేసేమంటున్న నిర్వాహకులు
~ యాజమాన్యం హచ్ యాత్రలో ఉండగా పాఠశాల మూసివేతపై అనుమానాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 26 : కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధి జయరాం నగర్ లో ఉన్న సెయింట్ మోసెస్ పాఠశాల విద్యార్థుల సామర్థ్యం సరిపడ లేరని బుధవారం అర్ధాంతరంగా మూసివేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు లు ఆందోళన తో పాఠశాల ముందు నిరసనకు దిగారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజుల అనంతరం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా పాఠశాల మూసివేయడంతో పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి సిబ్బందికి నిడదీశారు. పాఠశాల యాజమాన్యం సయ్యద్ భాకర్ హజ్ యాత్రలో ఉన్నారని, వారి ఆదేశాల మేరకే పాఠశాలను మూసివేసామని ఉపాధ్యాయులు తెలిపారు. దీనిపై మండిపడ్డ తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఇప్పటికే తమ వద్ద ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను పాక్షిక రుసుమును వసూలు చేశారని, ఇప్పటికిప్పుడు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలని, ఇప్పటికే పలు పాఠశాలలో కొంత పోర్షన్ కూడా ముగించుకొని ఇంటర్నల్ పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. తాము వసూలు చేసిన ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను తిరిగి చెల్లిస్తామంటున్న పాఠశాల నిర్వాహకులు. ఇప్పటికిప్పుడు పిల్లల పరిస్థితి ఏమిటనే మీమాంస తల్లిదండ్రులు ఉండిపోయారు.