ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు
• గాజులరామారం బాలాజీ లేఔట్ లో చోటు చేసుకున్న సంఘటన
• ఆర్థిక ఇబ్బందులే కారణమా…? లేక మరేదైనా…?
• దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ రాత్రి), సెప్టెంబర్ 1 : ఆర్థిక ఇబ్బందులతో తమ ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల నుంచి వలస వచ్చి గాజులరామారం బాలాజీ లేఔట్ లోని అపార్ట్మెంట్ లో వెంకటేష్(40), వర్షిణి(33) దంపతులు వారి ఇద్దరి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3) తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన పిల్లలను చంపి తాము కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.