ఓటరు తుది జాబితాను విడుదల చేసిన ఎన్నికల అధికారులు.
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 4: రానున్న ఎన్నికలకు తొలి ఓటర్ జాబితాను కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఈఆర్ఓ నాగమణి, ఏఈఆర్ఓ ఉదయ్ కుమార్, ఎన్నికల సిబ్బందితో కలిసి బుధవారం విడుదల చేశారు.
ముసాయిదా నుంచి తుది ఓటర్ జాబితా వరకు…
ఆగస్టు 21న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితా నుంచి సెప్టెంబర్ 19 వరకు మొత్తం 45,399 దరఖాస్తులు అందాయి. వీటిలో 41, 255 దరఖాస్తులను అంగీకరించగా 4,144 దరఖాస్తులను తిరస్కరించారు. వీటిలో నూతన ఓటర్ నమోదు (ఫారం-6)కు 29,681 నూతనంగా నమోదయ్యాయి వీరిలో పురుష ఓటర్లు 14,943, మహిళ ఓటర్లు 14,713, ఇతరులు 25 మంది ఉన్నారు. దీని ప్రకారం నియోజకవర్గం మొత్తం ఓటర్లు 6,69,253 కాగా వారిలో పురుష ఓటర్లు 3,51,307, మహిళా ఓటర్లు 3,17,793, ఇతరులు 153 మంది ఉన్నారు.