కాంగ్రెస్ పార్టీలోకి ఆగని చేరికలు
కుత్బుల్లాపూర్, (న్యూస్ విధాత్రి): అక్టోబర్ 30 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక తప్పదు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిల్ల పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డకి చెందిన 100 మంది, రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ కి చెందిన 200 మంది, గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్ కు చెందిన 100 మంది, జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస నగర్ కి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు