‘కీచక’ ఎస్ఎఫ్ఏ
~ తన క్రింద పని చేసే పారిశుద్ధ్య కార్మికురాలితో రాసలీలలు
~ వీడియోలు తీసి రాక్షసానందం
~ గత కొంతకాలంగా సాగుతున్న బాగోతం
~ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
~ వీడియోలు బయటకు రావడంతో బట్టబయలైన తతంగం
~ ఉన్నతాధికారులు విచారణ, విధుల నుంచి తొలగింపు
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి మే 23 : ఆ సర్కిల్ పారిశుద్ధ్య విభాగంలోని సిబ్బంది రాసలీలలు రచ్చకెక్కాయి. తన క్రింద పని చేసే ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిని లోబర్చుకునో, లొంగదీసుకొనో గత కొంతకాలంగా కామ కలాపాలు కొనసాగించుకుంటూ ఆపై ఆ కామ క్రీడలను స్వయంగా తన సెల్ ఫోన్ లో వీడియోలను చిత్రీకరించి రాక్షసానందాన్ని పొందుతున్నాడు ఓ ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్). ఈ వ్యవహారం అంతా ఎప్పటి నుంచో జరుగుతున్న సదరు వీడియోలు ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసలు బండారం బట్టబయలు అయింది. ఇదీ… ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న గాజులరామారం సర్కిల్ పరిధి సూరారం ప్రాంతంలో ఎస్ఎఫ్ఏ గా విధులు నిర్వహిస్తున్న కిషన్ రాసలీలల భాగోతం.
అసలేం జరిగింది…. ఎలా బయటకు వచ్చింది…
గాజులరామారం సర్కిల్ పారిశుద్ధ్య విభాగంలో ఎస్ ఎఫ్ ఏ గా విధులు నిర్వహించే కిషన్ తన కింద పని చేసే పారిశుద్ధ్య కార్మికురాలితో గత కొంతకాలంగా లైంగిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు (ఇరువురి అంగీకారంతోనా… బలవంతంగానా… అనే విషయం అధికారుల విచారణలో తేలాల్సి ఉంది). అంతేకాకుండా ఈ బాగోతం అంతా తన సెల్ ఫోన్‌తో తో వీడియోలు తీసి భద్రపరచుకున్నాడు. ఈ క్రమంలో సదరు ఎస్ ఎఫ్ ఏ ఇటీవల తన ఇంట్లో శుభకార్యం ఉందని సెలవులపై వెళ్తూ అధికారుల సూచనలతో తన తోటి మరో ఎస్ ఎఫ్ ఏ కు ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) ద్వారా కార్మికుల హాజరు నమోదు చేసుకునేందుకు తన సెల్ ఫోను అప్పగించి వెళ్ళాడు. ఆ ఎస్ఎఫ్ఏ సదరు ఫోన్ ను కిషన్ బృందంలోనే పనిచేసే ప్రణయ్ అనే పారిశుద్ధ్య కార్మికుడికి ఇచ్చి కార్మికుల హాజరు నమోదు చేసుకోమన్నాడు. ఇంతవరకు అంత బాగానే ఉన్నా… ఆ కార్మికుడు హాజరు నమోదు చేసుకునే సమయంలో సెల్ ఫోన్ లోని వీడియోలను చూసి తన ఫోన్ లోకి బదిలీ చేసుకొని వైరల్ చేసినట్లు సమాచారం.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు…
ఎస్ఎఫ్ఏ లైంగిక వేధింపుల వీడియోలు, చిత్రాలు బయటకు వచ్చి రావడంతోనే పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో జిహెచ్ఎంసి పరిధిలో సదరు వీడియోలు వైరల్ గా మారడంతో పాటు ఉన్నతాధికారుల వరకు విషయం విస్తరించడంతో గాజులరామారం సర్కిల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో లైంగిక భాగోతంపై సంబంధిత అధికారులు విచారణ, వివరణ , ఉన్నతాధికారులకు సంజాయిషీ వంటి అంశాలతో ఉరుకులు, పరుగులు పెట్టారు.
ఆదేశాలు…విచారణ…తొలగింపులు… అన్నీ చకచక…
ఈ జరుగుతున్న తతంగమంతా సర్కిల్ అధికారులకు గత వారం రోజుల క్రితమే తెలియడంతో విచారణకు ఆదేశించి కిషన్ ను విధుల నుంచి బహిష్కరించారు. అప్పటినుంచి విచారణ జరుగుతూనే ఉండగా ఇంతలోనే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో విషయం సర్కిల్ అధికారులు చేయి దాటిపోయి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో అక్కడి నుంచి ఆగమేగాలపై ఆదేశాలు రావడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, కిషన్, ప్రణయ్, బాధితురాలిని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో హాజరు పరిచి విచారించడం వంటి అంశాలన్నీ చకచకా గురువారం జరిగిపోయాయి. ఉన్నతాధికారుల విచారణ అనంతరం ఎస్ఎఫ్ఐ కిషన్ వీడియోలు వైరల్ చేసిన పారిశుధ్య కార్మికుడు ప్రణయ్ లను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు సర్కిల్ అధికారులు తెలిపారు.