కుత్బుల్లాపూర్ కు బీఆర్ఎస్ వరగబెట్టింది ఏమీ లేదు. – గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తక్వాడే

గాజులరామారం (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 30: కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని.. బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ నియోజకవర్గానికి 9 ఏళ్లుగా వరగబెట్టింది ఏమీ లేదని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తక్వాడే అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధి గాజులరామారం, సూరారం, చింతల్, జగద్గిరిగుట్ట డివిజన్ ల బిజెపి ముఖ్య నాయకుల సమావేశం ఆయా డివిజన్ లలో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం వహించారు.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిలుగా గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తక్వాడే , కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ , బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా. ఎస్ మల్లారెడ్డి హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తరపున ప్రచారం చేపట్టి, బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు కూన శ్రీనివాస్ గౌడ్, జేకే శేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి, బావి గడ్డ రవి, చండి శ్రీనివాస్, వివిధ డివిజన్ ల అధ్యక్షులు సాయినాథ్, పున్నారెడ్డి, పత్తి సతీష్ ,దుర్యోధనరావు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More