కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 9 నామినేషన్లు దాఖలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి ),నవంబర్ 8: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం కుత్బుల్లాపూర్ ఆర్వో కార్యాలయంలో 9 నామినేషన్లు నమోదు అయ్యాయి. దీనిలో దూలం దుర్గారావు, మహమ్మద్ మహిసన్, మేకల కార్తీక్ యాదవ్ లు స్వాతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
తోట సువర్ణ ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున రెండు సెట్ల నామినేషన్లు నమోదు చేశారు. రా సూరి చంద్రశేఖర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావలె) పార్టీ, చౌదరి గారి సాత్విక విద్యార్థుల రాజకీయ పార్టీ, మేకల కార్తీక్ యాదవ్ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ, దొంతుల రమేష్ ముదిరాజ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.
ఇప్పటివరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 12 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి పులి సైదులు తెలిపారు.