కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 10 నామినేషన్లు దాఖలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 9: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం ఆర్వో కార్యాలయంలో 10 నామినేషన్లు నమోదు అయ్యాయి.భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరఫున బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున కోలన్ హనుమంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరపున కూన శ్రీశైలం గౌడ్, కూన దినేష్ గౌడ్, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి కాట్రం మంజులత, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున వి . కిరణ్ కుమార్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున మహమ్మద్ వాజిద్, రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ తరపున మహమ్మద్ అజార్ నామినేషన్లు దాఖలు చేయగా, సాయికుమార్ పంతుల, మహమ్మద్ మహిసన్ లు స్వాతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
ఇప్పటివరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 22 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి పులి సైదులు తెలిపారు.