కుత్బుల్లాపూర్ లో నమోదైన తొలి నామినేషన్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 6: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ బోణీ కొట్టింది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన అనంతరం మొదటి, రెండవ రోజు కుత్బుల్లాపూర్ లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మూడవ రోజైన సోమవారం స్వతంత్ర అభ్యర్థి బిక్షపతి రిటర్నింగ్ కార్యాలయంలో తొలి నామినేషన్ ను దాఖలు చేశారు.