కుత్బుల్లాపూర్ సర్కిల్ ఈఈగా లక్ష్మీ గణేష్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 10 : కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగ నూతన ఈఈ గా లక్ష్మీ గణేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగంలో క్యూసి డిఈఈ గా బాధ్యతలు నిర్వహించిన ఆయన పదోన్నతి పొంది కుత్బుల్లాపూర్ ఈఈ గా బాధ్యతలు చేపట్టారు. గత ఈఈ గా బాధ్యతలు నిర్వహించిన కృష్ణ చైతన్య మే 31వ తేదీన పదవీ విరమణ పొందడంతో ఆ స్థానంలోకి గణేష్ ఈఈగా వచ్చారు.