కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
~ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జూన్ 25 : కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాల కె ఫోర్ క్యాంపస్ లో 7వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే బాలుడు అనుమానాస్పదగా మృతి చెందాడు. సోమవారం రాత్రి తోటి వారితో కలిసి భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థి ఉదయం నిద్ర లేవలేదు. దీంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు బాలుడి మృతికి గల కారణాలపై
దర్యాప్తు చేస్తున్నారు.