గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు
~ నార్కోటిక్ ప్రత్యేక జాగిలంతో…
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జూలై 8: సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏసీపీ రాములు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు సోమవారం నిర్వహించారు. మైసమ్మగూడలోని హాస్టళ్లు, టీ-స్టాళ్లు, కెఫేలు, సుమారు 15 కిల్లీ దుఖాణాలు, ధూమపానం చేసే ప్రాంతాలు, విద్యార్థులు గుమ్మిగూడే ప్రాంతాలతో పాటు అనుమానస్పదంగా ఉన్న పలు ప్రాంతాల్లో నార్కోటిక్ ప్రత్యేక జాగిలంతో తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఐ విజయ వర్ధన్, ఎస్ఐ ప్రవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.