గణేష్ మండప నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి- సిఐ ప్రశాంత్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 7: సంస్కృతి , సంప్రదాయాలకు నిలయమైన పండుగలను కలసికట్టుగా జరుపుకునే తత్వం తెలంగాణ ప్రజల సొంతం అని పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్ అన్నారు. ఈ నెల 18న వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహ మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సీఐ ప్రశాంత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పీఎస్ పరిదిలో త్వరలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఉత్సవ కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై వినాయక మండప ఏర్పాట్లపై పోలీసులు సూచించిన నియమ నిబంధనలను పాటించాలన్నారు.