కుత్బుల్లాపూర్, న్యూస్ విధాత్రి, ఏప్రిల్ 21: ఎన్ బీ కార్పొరేట్ టీ-20 ఛాలెంజ్ సీజన్ – 26లో సస్టైనర్స్ క్రికెట్ టీం కెప్టెన్ నవాజ్ సారథ్యంలో గోల్డ్ కప్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. లీగ్ దశలో నిర్వహించిన 7 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో నెగ్గి గోల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకున్న సస్టైనర్స్ క్రికెట్ టీం ప్రత్యర్థి జట్టు బ్లాక్ పాంథర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సస్టైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగుల విజయ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బ్లాక్ పాంథర్స్ జట్టు 19.4 ఓవర్లకు కేవలం 147 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ప్రేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా 30 బంతుల్లో 48 పరుగులు కొట్టి, 2.4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన ముద్దసీర్ బేగ్ నిలిచాడు. కెప్టెన్ నవాజ్ 40 బంతుల్లో 51 (అర్థ సెంచరీ) పరుగులతో రాణించగా, ఓపెనర్లు సలీం ఖాన్ 32 పరుగులు, నరేంద్ర దత్త 24 పరుగులతో జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన అహ్మద్ హుస్సేన్ ఉత్తమ బౌలర్ గా నిలిచాడు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.