చింతల్ లోని హెచ్ఎంటి పరిశ్రమను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి ), జూలై 12 : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ లోని హెచ్ఎంటి పరిశ్రమను కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్ డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, పరిశ్రమ సీఎండీ రాజేష్ కోహ్లీ, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు హెచ్ఎంటి పరిశ్రమలో కలియ తిరుగుతూ జరుగుతున్న పనుల వివరాలను తెలుసుకొని యంత్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం హెచ్ఎంటి పరిపాలన విభాగ నాలుగవంతస్తులో అధికారులు, సిబ్బంది తో సమాలోచన సమావేశాన్ని నిర్వహించారు.