~ కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం సమీపంలో ఘటన
~ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం వెనకవైపు ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో సుమారు 25 వయసు కలిగిన గుర్తుతెలియని ఓ ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
..