జంట సర్కిళ్లలో మాన్ సూన్ బృందాలు సిద్ధం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 1: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లు, డ్రైనేజీలు, మ్యాన్ హో ళ్లతో పాటు వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోని మరమ్మతు చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని 8 డివిజన్లకు గాను డివిజన్ కు ఒకటి చొప్పున 8 మాన్ సూన్ బృందాలను శనివారం కేటాయించారు. ఒక్కో మాన్ సూన్ బృందంలో నలుగురు కార్మికులు, ఒక డ్రైవర్ ఉంటారు. ఈ
మాన్ సూన్ వాహనాలను జంట సర్కిళ్ల ఉపకమిషనర్లు వి. నర్సింహా, ఎల్పీ. మల్లయ్య ఆయా సర్కిళ్ల కార్యాలయాల్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని మాన్ సూన్ పనులకు గాను సుమారు కోటి రూపాయలు మంజూరు చేయగా, గాజులరామారం సర్కిల్ పరిధిలోని పనులకు రూ. 1.09 కోట్లు మంజూరు చేసినట్లు ఈఈ కిష్టప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.