జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేస్తూ.. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.
- కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి ), అక్టోబర్ 2: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీడిమెట్ల గ్రామంలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి సోమవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారదులుగా ఉన్నటువంటి జర్నలిస్టుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు వెంటనే రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సీనియర్ పాత్రికేయులు వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు దయాకర్, నాగేంద్ర చారి, నరేందర్ రాజ్. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ట్రెజరర్ శేషారెడ్డి, ఉపాధ్యక్షులు యర్రంశెట్టి కలికి మూర్తి , శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, న ర్సింహులు, జాయింట్ సెక్రటరీ దత్తు, నాగబాబు, గ్రంథాలు, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.